Namaste NRI

ఉత్తరాఖండ్ గవర్నర్ సంచలన నిర్ణయం

ఉత్తరాఖండ్‌ గవర్నర్‌ బేబీ రాణి మౌర్య సంచలన నిర్ణయం తీసుకున్నారు. గవర్నర్‌ పదవికి రాజీనామా చేశారు. ఇంకా రెండేళ్ల పదవీ కాలం మిలిగి ఉండగానే ఆమె గవర్నర్‌ పదవికి రాజీనామా చేయడం చర్చనీయాంశమైంది. రాజీనామా లేఖను రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింథ్‌కు పంపినట్టు రాజ్‌భవన్‌  అధికారి ఒకరు తెలిపారు. వ్యక్తిగత కారణాలతోనే ఆమె రాజీనామా చేసినట్టు పేర్కొన్నారు. 2018 ఆగస్టు 26న గవర్నర్‌గా బాధ్యతలు చేపట్టారు. అప్పటి  గవర్నర్‌ కృష్ణకాంత్‌ పాల్‌ పదవీకాలం ముగియడంతో కేంద్ర ప్రభుత్వం బేబీ రాణి మౌర్యను గవర్నర్‌గా నియమించింది. గత నెలతో ఆమె గవర్నర్‌గా బాధ్యతలు చేపట్టి మూడేళ్లు పూర్తయ్యాయి. యూపీ ఎన్నికల బరిలో నిలవాలనే ఉద్దేశంతోనే ఆమె రాజీనామా చేసినట్లు ప్రచారం జరుగుతోంది. వచ్చే ఏడాది జరిగే శాసనసభ ఎన్నికల్లో అగ్రా నుంచి బరిలో దిగుతారని తెలుస్తోంది.

Social Share Spread Message

Latest News

Our Advertisers

Previous slide
Next slide

తాజా వార్తా చిత్రాలు

NRI Events