Skip to main content

Namaste NRI

సీఎం స్టాలిన్‌ను ఆహ్వానించిన వరలక్ష్మి శరత్‌ కుమార్‌

కోలీవుడ్ న‌టి వరలక్ష్మి శ‌ర‌త్ కుమార్ త్వరలోనే పెళ్లి పీట‌లు ఎక్క‌బోతుంది. ముంబాయికి చెందిన వ్యాపార వేత్త, ఆర్ట్‌ గ్యాలరీల నిర్వాహకుడు నిచోలై సచ్‌దేవ్‌ని త్వరలోనే ఆమె వివాహం చేసుకోనున్నారు. ఈ ఏడాది మార్చిలో వీరిద్ద‌రి ఎంగేజ్‌మెంట్ ఘ‌నంగా జ‌రిగింది. ఇక జూలైలో వీరి వివాహం జ‌రుగ‌నున్న‌ట్లు స‌మాచారం. ఈ క్ర‌మంలోనే పెళ్లి వేడుక‌ల‌కు సిద్దమవుతుంది. తాజాగా వరలక్ష్మి తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్‌ దంపతులను క‌లిసి ఆహ్వానం అందించింది. శరత్‌కుమార్, రాధిక శరత్‌కుమార్‌ల‌తో క‌లిసి స్టాలిన్ ఇంటికి వెళ్లిన వరలక్ష్మి త‌మ వివాహానికి రావాలని కోరింది. ఈ సంద‌ర్భంగా స్టాలిన్ నుంచి ఆశీస్సులు తీసుకుంది.

Social Share Spread Message

Latest News