Skip to main content

Namaste NRI

వరలక్ష్మీ శరత్ కుమార్ కూర్మ నాయకి గ్రాండ్ గా ప్రారంభం

వరలక్ష్మీ శరత్‌కుమార్‌ ప్రధాన పాత్రలో కె.హర్షవర్ధన్‌ దర్శకత్వంలో రూపొందిస్తున్న చిత్రం కూర్మ నాయకి. ఈ  చిత్రం   హైదరాబాద్‌లో ప్రారంభమైంది. కె.విజిత రావు నిర్మాత. ముహూర్తపు సన్నివేశానికి ప్రముఖ నిర్మాత డీవీవీ దానయ్య క్లాప్‌నిచ్చారు. దర్శకుడు చిత్ర విశేషాలు తెలియజేస్తూ ఒక దొంగ, దేవుడు, దెయ్యం నేపథ్యంలో సాగే కథ ఇది. ఆద్యంతం ఆసక్తికరంగా సాగుతుంది. వరలక్ష్మీ శరత్‌కుమార్‌ పాత్ర గత చిత్రాలకు పూర్తి భిన్నంగా ఉంటుంది అని చిత్రబృందం పేర్కొంది. అన్ని వర్గాలను మెప్పించే కాన్సెప్ట్‌ ఇదని నిర్మాత కె.విజిత రావు పేర్కొ న్నారు. ఈ చిత్రానికి కెమెరా: రామ్‌, సంగీతం: శేఖర్‌చంద్ర, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: కె.హర్షవర్ధన్‌.

Social Share Spread Message

Latest News