Namaste NRI

ఆనాటి వర్మ కనిపించారు : విజయేంద్ర ప్రసాద్

పూజా భలేకర్‌ ప్రధాన పాత్రలో రామ్‌గోపాల్‌ వర్మ దర్ధకత్వం వహించిన చిత్రం అమ్మాయి. టి.అంజయ్య. శ్రేష్ట పటేల్‌ మూవీస్‌ సమర్పణలో ఇండో చైనీస్‌  కో ప్రొడక్షన్స్‌, పారిజాత క్రియేషన్స్‌ ఆర్ట్సీ మీడియా పతాకాలపై రూపొందిన ఈ సినిమా నేడు విడుదలవుతోంది. హైదరాబాద్‌లో జరిగిన ప్రీ రిలీజ్‌ వేడుకలో సంగీత దర్శకుడు కీరవాణి మాట్లాడుతూ  అమ్మాయి చిత్రంలో ఎమోషన్‌ ఉంది. ఈ సినిమా కోసం టీమ్‌ ఎంతో అంకితభావంతో పనిచేశారు. ఈ సినిమా గొప్ప విజయం సాధించాలి అన్నారు. దర్శకుడు విజయేంద్ర ప్రసాద్‌ మాట్లాడుతూ అమ్మాయి సినిమా ట్రైలర్‌ చూసిన తర్వాత వర్మలో నాకు శివ సినిమా నాటి డైరెక్టర్‌ కనిపించారు. అవతార్‌ లాంటి సినిమాలే 20,000 థియేటర్స్‌లలో రిలీజ్‌ అయితే, అమ్మాయి చిత్రం 47,000 స్క్రీన్‌లలో రిలీజ్‌ కావడం తెలుగు వారందరికీ గర్వకారం. ఇలాంటి మంచి సినిమా విజయం సాధించాలి అని అన్నారు. ఈ కార్యక్రమంలో  చిత్ర సమర్పకులు టి.అంజయ్య, పూజా భలేకర్‌, నిర్మాతలు మధు మంతెన, నట్టి కుమార్‌ , తుమ్మలపల్లి రామ సత్యనారాయణ, రచయిత కోన వెంకటన్‌ తదితరులు పాల్గొన్నారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events