వరుణ్ తేజ్ హీరోగా కిరణ్ కొర్రపాటి తెరకెక్కిస్తున్న చిత్రం గని. అల్లూ బాబీ కంపెనీ, రెనస్సన్స్ పిక్చర్స్ సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమాకు మెగా నిర్మాత అల్లు అరవింద్ సమర్పకుడిగా ఉన్నారు. ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో ప్రీ రిలీజ్ వేడుకను నర్విహించారు. వరుణ్‌తేజ్ మాట్లాడుతూ ఈ సినిమాలో ఉపేంద్ర, సునీల్‌శెట్టి, జగపతిబాబు, నదియా వంటి సీనియర్స్‌తో పనిచేయడం వల్ల ఎంతో నేర్చుకున్నా. నిర్మాతలు ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా అధైర్యపడకుండా సినిమాను పూర్తిచేశామని అని తెలిపారు. ఈ చిత్రాన్ని మల్లీస్టారర్ అనొచ్చు. ఉపేంద్ర, సునీల్‌శెట్టి, జగపతిబాబు, నవీన్‌చంద్ర వంటి హీరోలంతా కలిసి పనిచేశారు. తమన్ సంగీతాన్నందించిన ఈ చిత్రాలన్నీ సక్సెస్ అవుతున్నాయి. ఈ సినిమా విజయం ఖాయమని నమ్ముతున్నా అని అల్లు అరవింద్ పేర్కొన్నారు. ఈ కార్యంక్రమంలో బాలీవుడ్ సీనియర్ నటుడు సునీల్‌శెట్టి, ఉపేంద్ర, తమన్ తదితరులు పాల్గొన్నారు.














