విజయ్ దేవరకొండ హీరోగా పరశురామ్ తెరకెక్కిస్తున్న సినిమా ఫ్యామిలీ స్టార్. మృణాల్ ఠాకూర్ కథానాయిక. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్ రాజు, శిరీష్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇది ఈ సంస్థ నుంచి వస్తున్న 54వ సినిమా. ఈ చిత్రం టైటిల్ టీజర్‌ని మేకర్స్ విడుదల చేశారు. ఇంట్లో పనులు చేసే ఫ్యామిలీ మ్యాన్‌లా, బయట రౌడీల బెండు తీసే పవర్‌ఫుల్ మ్యాన్‌లా ఇందులో దేవరకొండ విజయ్ కనిపిస్తాడని దర్శకుడు పరశురామ్ చెప్పాడు. ఈ ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్‌టైనర్ సంక్రాంతికి విడుదల కానుంది. ఈ సినిమాకి ఛాయాగ్రహణం: కేయూ మోహనన్, సంగీతం : గోపీసుందర్, కళ: ఎ.ఎస్.ప్రకాశ్, కూర్పు : మూర్తాండ్ కె.వెంకటేశ్, క్రియేటివ్ ప్రొడ్యూసర్: వాసువర్మ.














