Skip to main content

Namaste NRI

విజయ్‌ దేవరకొండ ఖుషీ మూవీ ఫస్ట్‌ సింగిల్‌

విజయ్‌ దేవరకొండ హీరోగా నటిస్తున్న సినిమా ఖుషి. విజయ్‌కు జోడీగా సమంత నటిస్తుంది. శివ నిర్వాణ దర్శకత్వం వహిస్తు న్నారు. ఈ సినిమా ప్రస్తుతం శరవేగంగా షూటింగ్‌ జరుపుకుంటుంది. ఇప్పటికే రిలీజైన పోస్టర్‌లు సినిమాపై కాస్త మంచి అటెన్షన్‌నే క్రియేట్‌ చేశాయి. రోమ్‌-కామ్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమా సెప్టెంబర్‌లో రిలీజ్ కానుంది. ఈ క్రమంలో మేకర్స్‌ ఇప్పటి నుంచే పలు అప్‌డేట్‌లు ప్రకటిస్తూ సినిమాపై అంచనాలు నెలకొల్పుతున్నారు. తాజాగా మేకర్స్‌ ఈ సినిమా ఫస్ట్‌ సింగిల్‌ను రిలీజ్‌ చేశారు. నా రోజా నువ్వే అంటూ సాగే బ్యూటిఫుల్‌ మెలోడీ ప్రేక్షకులను తెగ ఆకట్టుకుంది. హేషమ్‌ అబ్దుల్‌ స్వర పరిచిన ఈ పాట కొత్తగా, క్యాచీగా ఉంది. అంతే బ్యూటిఫుల్‌గా హేషమ్‌ ఈ పాటను స్వయంగా ఆలపించాడు. ఈ పాటకు శివ నిర్వాణ సాహిత్యం అందించడం విశేషం. ముస్లింగా సమంత ఆకట్టుకుంటుంది. ఇక కాశ్మీర్‌ అందాలను కూడా ఈ పాటలో చూపించారు.

కాశ్మీర్‌ బ్యాక్‌గ్రాప్‌లో తెరకెక్కుతున్న ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్‌ సంస్థ నిర్మిస్తుంది. ముందుగా ఈ సినిమా కేవలం తెలుగు, తమిళ భాషల్లో రిలీజ్‌ చేయాలని అనుకున్నారు. కానీ ఇప్పుడు పాన్‌ ఇండియా లెవల్లో రిలీజ్‌ చేసేందుకు సన్నాహాలు చేస్తు న్నారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events