Skip to main content

Namaste NRI

ఫిబ్రవరి 4న విశాల్ సామాన్యుడు వస్తున్నాడు

సరికొత్త కథలను తెరపైకి తీసుకొస్తూ ప్రేక్షకులను సర్‌ ఫ్రైజ్‌ చేస్తుంటారు  కోవీవుడ్‌ స్టార్‌ విశాల్‌. ఆయన  కథానాయకుడిగా నటించిన సామాన్యుడు ఫిబ్రవరి 4న ప్రేక్షకుల ముందుకొస్తోంది. తు.ప.శరవణన్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రమిది. ఆ విషయాన్ని చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది. విశాల్‌ ఫిల్మ్‌ ఫ్యాక్టరీ పతాకంపై విశాల్‌ స్వయంగా నిర్మిస్తున్నారు. ఆయన జోడిగా డిరపుల్‌ హయాతి నటించింది. తెలుగు, తమిళ భాషల్లో రూపొందిన ఈ చిత్రం యాక్షన్‌ ప్రధానంగా సాగుతుంది. విశాల్‌ మరోసారి ఓ సరికొత్త కథని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తారని, ఇటీవల విడుదల చేసిన పాటలకి, ప్రచార చిత్రాలకి చక్కటి స్పందన లభిస్తోందని సినీ వర్గాలు తెలిపాయి. యువన్‌ శంకర్‌రాజా అందించిన బ్యాక్‌ గ్రౌండ్‌ స్కోర్‌ ఈ సినిమాను టెక్నికల్‌గా స్ట్రాంగ్‌గా మార్చేసింది అని చిత్ర బృందం పేర్కొంది. యోగిబాబు, బాబురాజ్‌ జాకబ్‌, పా తులసి, రవీనా  రవి ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు.   ఛాయాగ్రహణం : కెవిన్‌రాజ్‌, సంగీతం: యువన్‌శంకర్‌ రాజా.

Social Share Spread Message

Latest News