ఇండోనేషియా రాజధాని బాలీలో నవంబర్ లో జరగనున్న జీ`20 సదస్సుకు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ హాజరుకానున్నారు. ఈ విషయాన్ని ఇండోనేషియా అధ్యక్షుడు జొకో విడొడొ ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ జిన్ పింగ్, రష్యా అధ్యక్షుడు పుతిన్ కూడా వస్తున్నారు అని తెలిపారు. ఈ ఇద్దరు జీ`20కి హాజరు కానున్నట్లు తెలిపారు. ఉక్రెయిన్‌పై యుద్ధం మొదలుపెట్టిన తర్వాత రష్యా అధ్యక్షుడు హాజరుకానున్న తొలి అంతర్జాతీయ సదస్సు ఇది. ఈ సమావేశంలో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కూడా పాల్గొనే అవకాశం ఉండటంతో దీనికి ప్రాధాన్యం నెలకొంది.














