Namaste NRI

వాంటెడ్‌ పండుగాడ్‌ టీజర్‌ విడుదల

సునీల్, అనసూయ, సుధీర్, బ్రహ్మానందం, వెన్నెల కిషోర్, సప్తగిరి, శ్రీనివాస్ రెడ్డి, దీపిక తదితరులు ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం వాంటెడ్ పండుగాడ్. పట్టుకుంటే కోటీ.. అన్నది ఉపశీర్షిక. ఆగస్టు 19న ఈ సినిమా రిలీజ్ కానున్నది. తాజాగా చిత్ర టీజర్ను విడుదల చేశారు. ఈ సందర్భంగా రాఘవేంద్రరావు మాట్లాడుతూ చిన్న సినిమాలు ఆడటం కష్టమని అనుకుంటున్న తరుణంలో చిన్న చిత్రంగా వస్తున్న పెద్ద నవ్వుల సినిమా ఇది అన్నారు. నటుడు సుధీర్ మాట్లాడుతూ రాఘవేంద్రరావు సినిమాలు చూడటమే అదృష్టం. అలాంటిది ఆయన చిత్రంలో నటించే అవకాశం వచ్చింది. చాలా ఆనందంగా ఉందన్నారు. దర్శకుడు శ్రీధర్ సీపాన మాట్లాడుతూ ఈ సినిమాతో దర్శకుడు కావాలన్న నా కల నేరవేరింది. చిత్రీకరణ సమయంలో నాకు అండగా నిలబడ్డారు రాఘవేంద్రరావు గారు. ఆయన తరహా పాటు ఆకట్టుకుంటాయి. ప్రతీ సీన్ నవ్వుకునేలా ఉంటుంది అన్నారు. ఈ చిత్రానికి శ్రీధర్ సీపాన దర్శకుడు. సాయిబాబ కోవెలపూడి, వెంకట్ కోవెలమూడి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. దర్శకుడు కె.రాఘవేంద్రరావు సమర్పిస్తున్నారు.  ఈ కార్యక్రమంలో జోసెఫ్, పి.ఆర్. శ్రీనివాస్ రెడ్డి, దీపిక, కరాటే కల్యాణి, శంకర్ తదితరులు పాల్గొన్నారు. 
Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events