Skip to main content

Namaste NRI

ప్రవాసులు, నివాసితులకు వార్నింగ్… ఇకపై బీచుల్లో ఆ పని చేస్తే

దేశంలోని నివాసితులు, ప్రవాసులకు కువైత్‌ గట్టి వార్నింగ్‌ ఇచ్చింది. సముద్రతీర  ప్రాంతాలు, బీచులకు వెళ్లే సందర్శకులు, నత్తలు, గవ్వలు సేకరించడం నిషేధించబడిరది. ఎవరైన దీన్ని ఉల్లంఘిస్తే రూ.62వేల నుంచి రూ.12.41 లక్షల వరకు జరిమానా ఉంటుందని ఎన్విరాన్‌మెంట్‌ పబ్లిక్‌ అథారిటీ హెచ్చరించింది. ఇలా సముద్రపు గవ్వలు, నత్తలను సేకరించడం ద్వారా సముద్ర జీవుల మనుగడ దెబ్బతింటుందని పేర్కొంది. కనుక ఇకపై బీచులు, సముద్ర తీర ప్రాంతాలకు వెళ్లే ప్రవాసులు, నివాసితులు ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలని తెలిపింది. లేని పక్షంలో భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని వార్నింగ్‌ ఇచ్చింది. కువైత్‌ సముద్ర తీర ప్రాంతాలైన అంజాఫా, అల్‌ బిడ్డా, ఫింటాస్‌, అల్‌ జోన్‌లో ఈ చర్య అధికంగా ఉన్నట్లు సంబంధిత అధికారులు గుర్తించారు.

Social Share Spread Message

Latest News