Namaste NRI

పాక్ రాజకీయాల్లో జోక్యం చేసుకోవాల్సిన అవసరం మాకు లేదు

తనను గద్దెదింపేందుకు రాజకీయ కుట్ర వెనుక విదేశీ శక్తుల హస్తం ఉందంటూ పాక్‌ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ సంచలన ఆరోపణలు చేసిన విషయం తెలిసింది. తాజాగా నేరుగా అగ్రరాజ్యం అమెరికా మీదే ఖాన్‌ విమర్శ చేశాడు. ఈ నేపథ్యంలో అమెరికా స్పందించింది. ఇమ్రాన్‌ ఖాన్‌ చేస్తున్న ఆరోపణల్లో అర్థం లేదని వైట్‌హౌజ్‌ ఉన్నతాధికారి కేట్‌ బెడిరగ్‌ఫీల్డ్‌ వ్యాఖ్యానించారు. ఆమె మీడియాతో మాట్లాడుతూ తనను అధికారం నుంచి దింపేయాలని అమెరికా ప్రయత్నిస్తోందంటూ ఇమ్రాన్‌ చేసిన ఆరోపణల్లో ఎలాంటి వాస్తవం లేదు. పాక్‌ రాజ్యాంగం, చట్టాలపై మాకు గౌరవం ఉంది. జోక్యం చేసుకోవాల్సిన అవసరం మాకు లేదు. అక్కడి పరిస్థితులను ఎప్పటికప్పుడు మేం పరిశీలిస్తున్నాం అన్నారు. అంతకు మించి స్పంద్పించాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events