Namaste NRI

ఆ రాత్రి  ఏం జరిగింది?

బాహుబలి ప్రభాకర్‌, షకలక శంకర్‌ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న తాజా చిత్రం ప్రారంభమైంది.  రావుల రమేష్‌ నిర్మిస్తున్న ఈ సినిమా తొలి సన్నివేశానికి నిర్మాత ప్రసన్నకుమార్‌ కెమెరా స్విచ్చాన్‌ చేయగా, దర్శకుల సంఘం అధ్యక్షుడు వై. కాశీ విశ్వనాథ్‌ క్లాప్‌ కొట్టారు. నటుడు బాహుబలి ప్రభాకర్‌ మాట్లాడుతూ రిటైర్డ్‌ మిలటరీ మేజర్‌ జీవితంలో ఓ రాత్రి ఏం జరిగింది? అనే కథతో తెరకెక్కుతున్న చిత్రమిది. సినిమాకు కీలకమైన పాత్ర చేస్తున్నాను అన్నారు. రాజీపడకుండా ఈ సినిమా నిర్మిస్తున్నాం అన్నారు రావుల రమేష్‌. పాలిక్‌ మాట్లాడుతూ నాశిష్యురాలు వింధ్య రెడ్డి ఈ చిత్రకథ ఇచ్చారు అన్నారు. వింధ్యరెడ్డి,  సంగీత దర్శకుడు జాన్‌ భూషణ్‌  మాట్లాడారు. ఈ నెలాఖరులో గోవాలో తొలి షెడ్యూల్‌ ప్రారంభిస్తాం. హైదరాబాద్‌ అరకులో రెండో షెడ్యూల్‌ ప్లాన్‌ చేస్తున్నాం అన్నారు. చలపతిరావు, సుధ, జీవా, సౌజన్య తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: మల్లిక్‌ కె చంద్ర, సంగీతం: జాన్‌, పాటలు: సురేష్‌ గంగుల, కథ:వింధ్యరెడ్డి, స్క్రీన్‌ప్లే, మాటలు, నృత్యాలు, దర్శకత్వం :పాలిక్‌. ఆర్‌.ఆర్‌.ఆర్‌ క్రియేషన్స్‌ పతాకంపై రావుల రమేష్‌ నిర్మిస్తున్నారు.  ఈ కార్యక్రమంలో వింధ్యా రెడ్డి, జాన్‌ భూషణ్‌ తదితరులు పాల్గొన్నారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events