Namaste NRI

అతను ఏం చేసినా…  ఏం మాట్లాడినా సంచలనమే

అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ శైలి చాలా భిన్నంగా ఉంటుంది. అతను ఏం చేసినా,  ఏం మాట్లాడినా సంచలనమే. ఎప్పుడూ ఏదో ఒక వివాదంలో వార్తల్లో నిలుస్తుంటారు. అలాంటి ట్రంప్‌ ఈ సారి తన ఫ్యాన్స్‌కు బంపర్‌ ఆఫర్‌ ఇచ్చి వార్తల్లో నిలిచారు. చేతిలో పెద్ద పిజ్జా ను పెట్టుకుని,  అందులోని ఓ ఎంగిలి పిజ్జా ముక్కను ఆఫర్‌ చేశారు. ఫ్లోరిడా లోని ఫోర్ట్‌ మయర్స్‌లో రిపబ్లికన్‌ పార్టీ ప్రసంగం సందర్భంగా ఈ ఘటన చోటు చేసుకుంది. ట్రంప్‌ ఫోర్ట్‌ మయర్స్‌లోని లీ కౌంట్రీ అనే ప్రాంతంలో రిపబ్లికన్‌ పార్టీ తరఫున జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా అక్కడ ప్రసంగం అనంతరం డౌన్‌టౌన్‌ హౌస్‌ ఆఫ్‌ పిజ్జా  అనే దుకాణం వద్దకు వెళ్లారు. ఈ సందర్భంగా అక్కడ పిజ్జా ఆర్డర్‌ చేశారు. ఈ విషయం తెలుసుకున్న ఆయన మద్దతుదారులు, అభిమానులు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకుని ట్రంప్‌ను చుట్టుముట్టారు. ఆ సమయంలో ట్రంప్‌ ఓ పెద్ద పిజ్జాను చేత్తో పట్టుకుని అందులోని ఓ ముక్కని అభిమానుల వైపు చూపిస్తూ నేను తిన్న ఈ ముక్క ఎవరికైనా కావాలా ? అంటూ ఆఫర్‌ చేశారు. అనంతరం ఆ ముక్కను కొరికి తిన్నారు. దీంతో ట్రంప్‌ అభిమానులు ఒక్కసారిగా షాక్‌ అయ్యారు.

Social Share Spread Message

Latest News