Skip to main content

Namaste NRI

బ్రహ్మాస్త్ర ట్రైలర్‌ వచ్చేది ఎప్పుడంటే ?

రణ్‌బీర్‌ కపూర్‌, ఆలియా భట్‌ జంటగా అయాన్‌ ముఖర్జీ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం బ్రహ్మాస్త్రం. అమితాబ్‌ బచ్చన్‌, అక్కినేని నాగార్జున ప్రధాన పాత్రల్లో నటించారు. ఎస్‌ఎస్‌ రాజమౌళి సమర్పణలో రూపొందిస్తున్నారు. ప్రెేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ట్రైలర్‌ జూన్‌ 15న విడుదల కానుంది.  ఈ సందర్భంగా వైజాగ్‌లో నిర్వహించిన ప్రెస్‌ మీట్‌లో రాజమౌళి మాట్లాడుతూ బ్రహ్మాస్త్రం సినిమా బ్లాక్‌బస్టర్‌ అని మా  నాన్నగారు ముందుగానే చెప్పేశారు.  ప్రాంతాలు, భాషలు వేరు కావొచ్చు కానీ ఎవరు తీసిన సినిమాలైన ఇండియన్‌ సినిమాగా అభివర్ణించాలి అన్నారు. అయాన్‌ ముఖర్జీ మాట్లాడుతూ భారతీయ దేవుళ్ల స్ఫూర్తిగా ఈ చిత్రాన్ని తెరకెక్కించాను. తెలుగు సినిమా ఇప్పుడు భారతీయ సినిమా రంగానికి బ్రిడ్జిగా మారింది అన్నారు. రణబీర్‌ కపూర్‌ మాట్లాడుతూ దక్షిణాదిలో రజనీకాంత్‌, కమల్‌హాసన్‌, చిరంజీవి, పవన్‌ కల్యాణ్‌, ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌ వంటి ఎందరో ప్రతిభ ఉన్న హీరోలున్నారు. నాకు ఇష్టమైన హీరో డార్లింగ్‌ ప్రభాస్‌ అన్నారు. ఈ సినిమా సెప్టెంబర్‌ 9న హిందీ, తెలుగు, కన్నడ, మలయాళ భాషల్లో రిలీజ్‌ చేయనున్నారు.

Social Share Spread Message

Latest News