Skip to main content

Namaste NRI

కాస్మోస్‌ 2553 ఉపగ్రహ సాయంతో…  రోదసిలో పుతిన్‌ రహస్య ఆయుధం

రష్యాకు చెందిన రహస్య ఉపగ్రహం ‘కాస్మోస్‌ 2553’ ప్రపంచ దేశాలను కలవరపెడుతున్నది. ప్రస్తుతం డమ్మీ వార్‌హెడ్‌ (ఆయుధం)తో భూకక్ష్య వెలుపలి హద్దుల్లో సంచరిస్తున్న ఈ ఉపగ్రహం సాయంతో మున్ముందు క్షిపణులను, అణ్వాయుధాలను ప్రయోగించి శత్రు దేశాలకు చెందిన పలు కీలక ఉపగ్రహాలను నాశనం చేసేందుకు రోదసిలో రష్యా ఓ ప్లాట్‌ఫామ్‌ను అభివృద్ధి చేస్తున్నట్టు భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. అంతరిక్షంలో రష్యా మోహరించే ఆయుధానికి సంబంధించిన విడిభాగాలను ఈ ఉపగ్రహం పరీక్షిస్తున్నట్టు తాము భావిస్తున్నామని, దీని వల్ల ఎదురయ్యే ముప్పును తమ స్పేస్‌ కమాండ్‌ నిరంతరం పరిశీలిస్తున్నదని అమెరికా అధికారులు తెలిపారు.

Social Share Spread Message

Latest News