నాటోలో చేరాలని నిర్ణయించిన స్వీడన్, ఫిన్లాండ్ ప్రధానులతో త్వరలో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ చర్చిస్తారని వైట్‌హౌస్ వర్గాలు తెలిపాయి. వీటిపై తమ అభ్యంతరాలు తెలిపేందుకు టర్కీ విదేశాంగ మంత్రి కవుసోగ్లు అమెరికాకు పయనమ్యారు. ఈ రెండు దేశాలు ఏళ్లుగా తటస్థంగా ఉంటున్నాయి. నాటాలో చేరితే తీవ్ర పరిణామాలుంటాయని వాటిని రష్యా పలుమార్లు హెచ్చరించింది. ఇద్దరు ఫిన్లాండ్ దౌత్యాధికారులను రష్యా బహిష్కరించింది. నార్డిక్ దేశాలు నాటోలో చేరడంపై టర్కీ అభ్యంతరాలు త్వరలో సమసిపోతాయని నాటో అధికారులు అంచనా వేస్తున్నారు. వీటి చేరికను పలు యూరప్ దేశాలు స్వాగతించాయి.














