Skip to main content

Namaste NRI

ఎటువంటి వార్నింగ్ లేకుండానే.. వారిని చంపేయండి

ఇంధన ధరలు పెంచడాన్ని నిరసిస్తూ కజకిస్థాన్‌లో భారీ అందోళనలు జరుగుతున్నాయి. కజకిస్థాన్‌లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న వారిని ఎటువంటి వార్నింగ్‌ లేకుండానే చంపేయాలంటూ అధ్యక్షుడు కాసిమ్‌ జోమార్ట్‌ తొకయేవ్‌ ఆ దేశ బలగాలను ఆదేశించారు.  అయితే ఆ నిరసనల్లో శిక్షణ పొందిన ఉగ్రవాదులు ఉన్నట్లు అధ్యక్షుడు ఆరోపించారు. ఆల్మటి నగరంలో జరిగిన కాల్పుల్లో 26 మంది ఆందోళనకారులు, 15 మంది పోలీసులు మృతి చెందారు. చనిపోయిన ఆందోళనకారులు సాయుధ నేరస్తులని ప్రభుత్వం చెబుతోంది. హింసాత్మక నిరసనల్లో మరో మూడు వేల మందిని అరెస్టు చేశారు. ఆల్మటి నగరంలో ప్రస్తుతం పరిస్థితి నిలకడగా ఉందని, కానీ ఉగ్రవాదులు ప్రభుత్వ, ప్రైవేటు ఆస్తులను ధ్వంసం చేస్తున్నారని, అందుకే విధ్వంసక నిరసనకారుల్ని చంపేయాలంటూ పోలీసులకు, ఆర్మీకి ఆదేశాలు ఇచ్చినట్లు అధ్యక్షుడు కాసిమ్‌ తెలిపారు.

Social Share Spread Message

Latest News