కర్ణాటక ముఖ్యమంత్రి మార్పుపై సస్పెన్స్‌కు తెరపడిరది. ముఖ్యమంత్రి పదవికి బీఎస్ యడియూరప్ప రాజీనామా చేశారు. తొలుత సాయంత్రం గవర్నర్‌ను కలిసి తన రాజీనామాను పత్రాన్ని సమర్పిస్తానన్నారు. కానీ, తన మనసు మార్చుకుని మధ్యాహ్నం 12:30 గంటల ప్రాంతంలో రాజ్‌భవన్‌కు చేరుకున్నారు. రాజీనామాను పత్రాన్ని గవర్నర్‌కు సమర్పించారు. కాగా, రెండేళ్ల పాలన వేడుకల్లో ముఖ్యమంత్రి పదవికి తాను రాజీనామా చేస్తున్నట్లు యడ్డీ ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజకీయ జీవితంలో ఎన్నో అగ్ని పరీక్షలు ఎదుర్కొన్నా, కర్ణాటక అభివృద్ధి కోసంం చాలా చేశా. 75 ఏళ్లు దాటినా నాకు రెండేళ్ల పాటు అవకాశం ఇచ్చారు. అధిష్టానం నిర్ణయాన్ని గౌరవిస్తా అంటూ భావోద్వేగానికి లోనయ్యారు.