అమెరికా అంతర్జాతీయ అభివృద్ధి సంస్థ (యూఎస్‌ఏఐడీ) మిషన్ డైరెక్టర్‌గా భారత సంతతి మహిళ వీణా రెడ్డి బాధ్యతలు స్వీకరించారు. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వీణా రెడ్డికి శుభాకాంక్షలు తెలియజేశారు. అమెరికాలో భారత సంతతికి చెందిన మొదటి దౌత్యవేత్తగా ఈ ఘనత సాధించినందుకు గర్వపడుతున్నాను అన్నారు. యూఎస్‌ఏఐడీ మిషన్ డైరెక్టర్‌గా ఎంపికైన వీణా రెడ్డి భారత్‌తో పాటు భూటాన్‌లో సేవలు అందించనున్నారు.