Skip to main content

Namaste NRI

హైదరాబాద్‌లో కేపబులిటీ సెంటర్‌ను విస్తరించనున్న జొయిటిస్‌

ప్రముఖ జంతు ఆరోగ్య సంస్థ జొయిటిస్ కంపెనీ హైదరాబాద్‌లోని తమ కేపబులిటీ సెంటర్‌ను మరింత విస్తరించనుంది. సెప్టెంబర్ నుంచి కార్యకలాపాలు ప్రారంభించాలని నిర్ణయించింది. దీంతో వందలాది మందికి కొత్త ఉద్యోగాలు లభించనున్నాయి. ఈమేరకు అమెరికా పర్యటనలో ఉన్న సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రి శ్రీధర్ బాబుతోపాటు అధికారుల బృందంతో కంపెనీ ప్రతినిధులు సమావేశమయ్యారు. అనంతరం హైదరాబాద్‌లోని తమ కేపబిలిటీ సెంటర్‌ను విస్తరిస్తున్నట్లు ప్రకటించింది.

జొయిటిస్‌ ఇండియా నిర్ణయాన్ని సీఎం రేవంత్‌ స్వాగతించారు.  ఈ సందర్భంగా రేవంత్‌రెడ్డి  మాట్లాడుతూ రాష్ట్రంలో కొత్త ఆవిష్కరణలకు, వ్యాపార వృద్ధికి అపారమైన అవకాశాలున్నాయని చెప్పారు. హైదరాబాద్‌ను ప్రపంచస్థాయి లైఫ్ సైన్సెస్ హబ్‌గా తీర్చిదిద్దాలనే తమ ఆలోచనలకు ఈ పెట్టుబడులు దోహదపడుతాయ న్నారు. వందలాది మందికి ఉద్యోగాలు లభిస్తాయన్నారు. ఫ్యూచరిస్టిక్ టెక్నాలజీలో జొయిటిస్ రంగప్రవేశం హైదరాబాద్‌కు మరింత గుర్తింపు తెస్తుందన్నారు.

ఇండియాలో తమ కంపెనీ విస్తరణకు హైదరాబాద్ అనువైన ప్రాంతమని, తెలంగాణ ప్రభుత్వంతో భాగస్వా మ్యం కావటం సంతోషంగా ఉందని జొయిటిస్‌ కంపెనీ చీఫ్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ కీత్ సర్‌బాగ్ అన్నారు. తమ కంపెనీ విస్తరణ జంతు ఆరోగ్యానికి సంబంధించి సరికొత్త సాంకేతిక ఆవిష్కరణలకు ఉపయోగ పడుతుందని చెప్పారు. తెలంగాణలో అందుబాటులో ఉన్న ప్రపంచ స్థాయి ప్రతిభా వనరులను సద్వినియోగం చేసుకుం టామని జొయిటిస్ ఇండియా కెపాబిలిటీ సెంటర్ వైస్ ప్రెసిడెంట్ అనిల్ రాఘవ్ తెలిపారు. ప్రపంచంతో పోటీపడే సేవలు అందించడంతోపాటు రాష్ట్ర అభివృద్ధిలో పాలుపంచుకుంటామన్నారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events