
మంచు విష్ణు పాన్ ఇండియా యాక్షన్ సినిమాకు సిద్ధమవుతున్నారు. దీనికి ప్రభుదేవా దర్శకత్వం వహించనున్నారు. మంచు విష్ణు జన్మదినం సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు తెలియజేసిన ప్రభుదేవా..తన సోషల్‌మీడియా ద్వారా ఈ విషయాన్ని వెల్లడించారు.ఈ సందర్భంగా మంచు విష్ణుతో దిగిన ఫొటోను పంచుకున్నారు. యాక్షన్ థ్రిల్లర్‌గా ఈ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నారని, ఈ సినిమాలో మంచు విష్ణు సరికొత్త మేకోవర్‌లో కనిపించనున్నారని సమాచారం. ఈ చిత్రానికి సంబంధించిన నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలను త్వరలో వెల్లడించనున్నారు.















