Skip to main content

Namaste NRI

క్రిస్మస్ బరిలో బాలయ్య

అగ్ర కథానాయకుడు నందమూరి బాలకృష్ణ నటిస్తున్న NBK 111(వర్కింగ్‌ టైటిల్‌) సినిమా డిసెంబర్‌ 26న విడుదల కానున్నది. ఈ విషయాన్ని తెలియజేస్తూ వృద్ధి సినిమాస్‌ సంస్థ ప్రకటన విడుదల చేసింది. యాక్షన్‌, ఎమోషన్స్‌ మేళవింపుతో అద్భుతమైన మాస్‌ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమా రూపొందుతున్నదని, ఇందులో మాఫియా డాన్‌గా బాలకృష్ణ మాస్‌ అవతారం ప్రేక్షకులకు గూజ్‌బంప్స్‌ తెప్పిస్తుందని, వైవిధ్యమైన కథా, కథనాలతో దర్శకుడు మలినేని గోపీచంద్‌ తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో మునుపెన్నడూ చూడని కొత్త బాలయ్యను చూస్తారని మేకర్స్‌ తెలిపారు.

మంచు మనోజ్‌ ఇందులో బాలకృష్ణ తమ్ముడిగా పవర్‌ఫుల్‌ రోల్‌లో కనిపించనున్నారు. కాజల్‌ అగర్వాల్‌ కథానాయిక. శరవేగంగా పోస్ట్‌ప్రొడక్షన్‌ పనులు జరుపుకుంటున్న ఈ భారీ యాక్షన్‌ డ్రామాకు మాటలు: సాయిమాధవ్‌ బుర్రా, కెమెరా: అరవింద్‌ ఎస్‌.కశ్యప్‌, సంగీతం: ఎస్‌.థమన్‌, నిర్మాత: వెంకట సతీశ్‌ కిలారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events