Skip to main content

Namaste NRI

సంక్రాంతి బరిలో.. భర్త మహాశయులకు విజ్ఞప్తి

హీరో రవితేజ, దర్శకుడు కిషోర్‌ తిరుమల కాంబోలో సుధాకర్‌ చెరుకూరి ఎస్‌ఎల్‌వి సినిమాస్‌ బ్యానర్‌పై నిర్మిస్తున్న ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ భర్త మహాశయులకు విజ్ఞప్తి. ఆషికా రంగనాథ్‌, డింపుల్‌ హయతి హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్‌, పాటలు సినిమాపై మ్యాసీవ్‌ బజ్‌ను సృష్టించాయి. తాజాగా మేకర్స్‌ క్రిస్మస్‌ విషెస్‌ అందిస్తూ సినిమా నుంచి స్పెషల్‌ పోస్టర్‌ను రిలీజ్‌ చేశారు. అవుట్‌ అండ్‌ అవుట్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌తో సంక్రాంతికి పర్ఫెక్ట్‌ మూవీగా ప్రేక్షకుల్ని అలరించబోతుంది. జనవరి 13న ఈ చిత్రం గ్రాండ్‌గా రిలీజ్‌ కానుంది. ఈ చిత్రానికి రచన, దర్శకత్వం: కిషోర్‌ తిరుమల, నిర్మాత: సుధాకర్‌ చెరుకూరి, డీఓపీ : ప్రసాద్‌ మూరెళ్ల, సంగీతం: భీమ్స్‌ సిసిరోలియో, ఎడిటర్‌: శ్రీకర్‌ ప్రసాద్‌, ప్రొడక్షన్‌ డిజైనర్‌: ఏఎస్‌ ప్రకాష్‌, ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌: విజయ్‌ కుమార్‌ చాగంటి.

Social Share Spread Message

Latest News