Skip to main content

Namaste NRI

ఆ ఒక్కటి తప్ప మరేదైనా అడగండి : శృతిహాసన్‌

పూర్తిస్థాయిలో దక్షిణాది సినిమాలపై దృష్టిపెట్టేందుకు ఇటీవలే ముంబయి నుంచి చెన్నైకి షిప్ట్‌ అయింది అగ్ర కథానాయిక శృతిహాసన్‌. డూడుల్‌ ఆర్టిస్ట్‌ శంతను హజారికాతో నాలుగేళ్ల ప్రేమాయణానికి బ్రేకప్‌ చెప్పిన ఈ భామ ఇప్పుడు సినిమాలే తన ప్రపంచమని చెబుతున్నది. తాజాగా సోషల్‌మీడియాలో అభిమానులతో ముచ్చటించిన ఈ సొగసరి వారు అడిగిన ప్రశ్నలకు ఆసక్తికరమైన సమాధానాలిచ్చింది. పెళ్లెప్పుడంటూ పలువురు అభిమానులు అడిగిన ప్రశ్నలకు ఆ ఒక్కటి తప్ప మరేదైనా అడగండి. జవాబు ఇవ్వడానికి సిద్ధం అంటూ ఫన్నీగా రిైప్లె ఇచ్చింది. పదే పదే అదే ప్రశ్న అడగటం ఆపాలని కోరింది. ప్రస్తుతం తన దృష్టి మొత్తం సినిమాల మీదే ఉందని, నటిగా ఇదో కొత్త దశ అని వ్యాఖ్యానించింది. ప్రస్తుతం శృతిహాసన్‌ తెలుగులో దుల్కర్‌ సల్మాన్‌తో కలిసి ఆకాశంలో ఒక తార చిత్రంలో నటిస్తున్నది. పవన్‌ సాదినేని దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉంది.

Social Share Spread Message

Latest News