
అమెరికాలో వృద్ధులను టార్గెట్ చేస్తూ సుమారు 7.5 మిలియన్ డాలర్ల స్కామ్ కు పాల్పడిన 21 ఏళ్ల భారత సంతతి వ్యక్తిని అరెస్టు చేశారు. అమెరికా కోర్టులో అతనిపై నేరాభియోగాన్ని నమోదు చేశారు. నిందితుడిని గుజరాత్‌కు చెందిన జయ సునిల్‌భారతి గోస్వామిగా గుర్తించారు. అతను న్యూజెర్సీలో నివసిస్తున్నాడు. అయితే ఖతార్‌కు పరారీ అయ్యేందుకు ప్రయత్నిస్తున్న అతన్ని కెనడాలో పట్టుకున్నారు. వైర్ ఫ్రాడ్, మనీల్యాండరింగ్ కేసులను అతనిపై నమోదు చేసినట్లు యూఎస్ అటార్నీ మైఖేల్ డిజియాకమో తెలిపారు. ఒకవేళ అతనిపై నేరం రుజువైతే, అతనికి 20 ఏళ్ల జైలు శిక్ష పడనున్నది.















