Skip to main content

Namaste NRI

సెప్టెంబర్ 18న ప్రేక్షకుల ముందుకు హ్యాపీ జర్నీ

అన్నపూర్ణమ్మ, ఆమని, ఝాన్సీ, పాయల్‌ రాధాకృష్ణ, జినీషా అలిశెట్టి, రూపా శ్రీనివాస్‌, సువైనా ప్రధాన పాత్రల్లో నటిస్తున్న మహిళా ప్రధాన చిత్రం హ్యాపీ జర్నీ. అభిరామ్‌ నాయుడు దర్శకుడు. ఈ చిత్రాన్ని బాలాజీ గుత్తా, కౌశిక్‌ రెడ్డి నిర్మిస్తున్నారు. ఈ నెల 18న విడుదల చేయబోతున్నారు. రిలీజ్‌ డేట్‌ అనౌన్స్‌మెంట్‌ సందర్భంగా కొత్త పోస్టర్‌ను విడుదల చేశారు.

సమ్‌ ట్రిప్స్‌ ఛేంజ్‌ ప్లాన్‌..సమ్‌ ఛేంజ్‌ లైవ్స్‌ అనే పోస్టర్‌ ట్యాగ్‌లైన్‌ కథ తాలూకు భావాన్ని స్ఫురించేలా ఉంది. ఏడుగురు మహిళల జీవితాల చుట్టూ అల్లుకున్న కథ ఇదని, వారి మధ్య అనుబంధం, భావోద్వేగాలను ఆవిష్కరిస్తూ సాగుతుందని, విదేశీ ప్రయాణం నేపథ్యంలో ఆసక్తిగా ఉంటుందని మేకర్స్‌ తెలిపారు. ఈ చిత్రానికి సంగీతం: శేఖర్‌చంద్ర, రచన-దర్శకత్వం: అభిరామ్‌ నాయుడు.

Social Share Spread Message

Latest News