Skip to main content

Namaste NRI

భార‌తీయుల‌కు మ‌రో షాక్ ఇవ్వ‌నున్న అమెరికా

వీసాల‌పై ప‌లు ఆంక్ష‌లు విధిస్తున్న అమెరికా ఇప్పుడు మ‌రో షాక్ ఇచ్చేందుకు సిద్ధ‌మైంది. హెచ్‌1బీ వీసాదారుల్లో జాబ్ కోల్పోతే, మ‌రో జాబ్ వెతుక్కునేందుకు ఉన్న 60 రోజుల గ్రేస్ పీరియ‌డ్‌ను తొల‌గించేందుకు సిద్ధ‌మైంది. ఈ మేర‌కు అమెరికా ప్ర‌భుత్వానికి చెందిన ద డిపార్ట్‌మెంట్ ఆఫ్ హోమ్‌ల్యాండ్ (డీహెచ్ఎస్‌) ఎలిమినేటింగ్ ద డిస్క్రెష‌న‌రీ 60 డే గ్రేస్ పీరియ‌డ్ పేరుతో ఒక ప్ర‌తిపాద‌న చేసింది.

హెచ్‌1బీ స‌హా వివిధ వీసాలు క‌లిగిన విదేశీ పౌరులు తమ ఉద్యోగాలు కోల్పోతే ఇక‌పై వారికి కొత్త ఉద్యోగం వెతుక్కునేందుకు 60 రోజుల గ్రేస్ పీరియ‌డ్ వ‌ర్తించ‌దు. హెచ్‌1బీ వీసాదారులు ఉద్యోగాలు కోల్పోతే అమెరికాలో మ‌రో ఉద్యోగం వెతుక్కునేందుకు 60 రోజుల గ్రేస్ పీరియ‌డ్ ఇస్తూ ట్రంప్ ప్ర‌భుత్వం నిర్ణ‌యం తీసుకుంది. అంతే, ఉద్యోగం పోయినా, 60 రోజుల‌పాటు అక్క‌డే ఉండొచ్చు. కానీ, కొత్త ప్ర‌తిపాద‌న అమ‌లైతే ఈ గ్రేస్ పీరియ‌డ్ వ‌ర్తించ‌దు. ప్ర‌స్తుతం ఈ ప్ర‌తిపాద‌న‌ను ఫెడ‌ర‌ల్ రిజిష్ట‌ర్‌లో న‌మోదు చేశారు. దీనిపై ప్ర‌జ‌లు 60 రోజుల్లోగా త‌మ అభిప్రాయాలు చెప్పాలి. ఆ త‌ర్వాత ఈ రూల్ అమ‌లులోకి రావొచ్చు. అమెరికాలో ఉద్యోగాలు లేని ఈ1, ఈ2, ఈ3, హెచ్‌1బీ, హెచ్‌1బీ1, ఎల్‌1, ఓ1, టీఎన్ వీసాదారులంద‌రికీ వ‌ర్తిస్తుంది. ఈ రూల్ అమ‌లులోకి వ‌స్తే అమెరికాలో ఉంటున్న భార‌తీయుల‌పై ఎక్కువ ప్ర‌భావం ప‌డుతుంది.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events