Skip to main content

Namaste NRI

లవ్‌ అండ్‌ వార్‌ రణబీర్‌కపూర్‌ ఫస్ట్‌లుక్‌ విడుదల

సంజయ్‌లీలా భన్సాలీ దర్శకత్వంలో రూపొందుతున్న ప్రతిష్టాత్మక చిత్రం లవ్‌ అండ్‌ వార్‌. రణ్‌బీర్‌కపూర్‌, అలియాభట్‌, విక్కీకౌశల్‌ ప్రధాన పాత్రల్ని పోషిస్తున్నారు. నిర్మాణ దశలోనే ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. ఈ నేపథ్యంలో రణబీర్‌కపూర్‌ ఫస్ట్‌లుక్‌ని విడుదల చేశారు.

ఇందులో ఆయన చేతికి గాయంతో రక్తమోడుతూ కనిపిస్తున్నారు. ఎయిర్‌ఫోర్స్‌ ఆఫీసర్స్‌ బ్యాక్‌డ్రాప్‌లో ముక్కోణపు ప్రేమకథగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది జనవరి 21న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయబోతున్నట్లు మేకర్స్‌ తెలిపారు. సంజయ్‌లీలా భన్సాలీ దర్శకత్వంలో రాబోతున్న ఈ సినిమా కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events