Skip to main content

Namaste NRI

అమెరికాకు జిన్‌పింగ్‌ పిలుపు

కృత్రిమ మేధ(ఏఐ) మానవ నియంత్రణలోనే ఉండేలా, ప్రజల ప్రయోజనాల కోసం వినియోగించేలా చైనా, అమెరికా చూడాలని చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌ పిలుపునిచ్చారు. డొనాల్డ్‌ ట్రంప్‌తో వైట్‌ హౌస్‌లో జరిగిన సమావేశంలో ఏఐ అంశాన్ని ప్రస్తావించారు. వైట్‌ హౌస్‌ గ్రాండ్‌ ఫోయర్‌లో ట్రంప్‌తో కలిసి మాట్లాడిన జిన్‌పింగ్‌ ఏఐ రంగంలో తమ రెండు దేశాలు అగ్రగాములుగా ఎదిగాయన్నారు.ఏఐ అభివృద్ధి ఎల్లప్పుడూ మానవ నియంత్రణలో ఉంటూ ప్రజల శ్రేయస్సుకు ఉపయోగపడేలా చూసుకోవాల్సిన బాధ్యత మనపైన ఉంది అని జిన్‌పింగ్‌ తెలిపారు.

అమెరికా, చైనా మధ్య ఉన్న విస్తృత పోటీకి పరిమితులు విధించాలని, ఆరోగ్యకరంగా పోటీ ఉండాలని జిన్‌పింగ్‌ అన్నారు. ఇరు దేశాల సైన్యాల మధ్య మరింత బలమైన సమన్వయం ఉండాలని చైనా అధినేత పిలుపునిచ్చారు. జిన్‌పింగ్‌తో తనకున్న వ్యక్తిగత అనుబంధాన్ని ట్రంప్‌ ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఈ పర్యటనలో భద్రత, సాంకేతికత, సూపర్‌ ఇంటెలిజెన్స్‌కు సంబంధించిన అత్యవసర అంశాలపై కూడా మేము చర్చిస్తాము అని ట్రంప్‌ అన్నారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events