Skip to main content

Namaste NRI

సిగ్మా నాకు చాలా ప్రత్యేకం.. నిజంగా ఎగ్జైటింగ్‌గా ఉంది: ఫరియా అబ్దుల్లా

సందీప్‌కిషన్‌ కథానాయకుడిగా జేసన్‌ సంజయ్‌ దర్శకత్వంలో రూపొందిన చిత్రం సిగ్మా. ఫరియా అబ్దుల్లా కథానాయిక. లైకా ప్రొడక్షన్స్‌ పతాకంపై సుభాస్కరన్‌ నిర్మించిన ఈ చిత్రం అక్టోబర్‌ 2న విడుదల కానున్నది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో ఫరియా అబ్దుల్లా విలేకరులతో మాట్లాడారు. ఇందులో రేడియో జాకీలా కనిపిస్తా. మంచి ఎమోషనల్‌ క్యారెక్టర్‌ నాది. అన్ని రకాల ఎమోషన్స్‌నీ ఇందులో ప్రజెంట్‌ చేశాను. మంచి యాక్షన్‌ అడ్వెండర్‌ కామెడీ సినిమా ఇది. ఫ్యామిలీతో కలిసి హాయిగా చూడొచ్చు అని అన్నారు.

సందీప్‌కిషన్‌, నేనూ కలిసి ఎప్పట్నుంచో ఓ సినిమా చేయాలనుకుంటున్నాం. ఫైనల్‌గా సిగ్మాతో కుదిరింది. జూమ్‌ కాల్‌లో జేసన్‌ ఈ కథ చెప్పారు. కథ విన్న తర్వాత ఆయన్ను వయసెంత? అనడిగాను. 24ఏళ్లని చెప్పారు. నాకు చాలా ఇన్‌స్పైరింగ్‌గా అనిపించింది. ఒక సూపర్‌స్టార్‌ కొడుకు అనే ఫీలింగ్‌ ఆయనలో మచ్చుకైనా కనిపించదు. వినయంగా, ఫ్రెండ్లీగా ఉంటారు. తొలి సినిమా అయినప్పటికీ ఎంతో క్లారిటీగా, విజన్‌తో సినిమా తీశారు అని తెలిపింది ఫరియా అబ్దుల్లా. సిగ్మా లాంటి మంచి ప్రాజెక్ట్‌తో తమిళంలో ఎంట్రీ ఇవ్వడం ఆనందంగా ఉందని, తమన్‌ బీజీఎం, పాటలు నెక్ట్స్‌ లెవెల్లో ఉంటాయని ఫరియా పేర్కొన్నది.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events