ఆర్య కథానాయకుడిగా పా.రంజిత్ దర్శకత్వంలో రూపొందిన సర్పట్ట పరంబరై ప్రీక్వెల్ చిత్రీకరణ చెన్నైలో ప్రారంభమైంది. ఈ విషయాన్ని ఆర్య వెల్లడించాడు. ఈ సినిమా షూటింగ్ అయ్యాకా సర్పట్ట పరంబారై సీక్వెల్ స్టార్ట్ అవుతుందంటూ ఆర్య చెప్పుకోచ్చాడు. 2021 కరోనా లాక్‌డౌన్ సమయంలో అమెజాన్ ప్రైమ్‌లో ఈ చిత్రాన్ని విడుదల చేశారు.

ఉత్తర చెన్నై బాక్సింగ్ సంస్కృతి, రెండు బాక్సింగ్ వర్గాల మధ్య పోటీ నేపథ్యంలో ఈ కథ సాగింది. మొదటి భాగానికి ముందు జరిగిన కథను ప్రీక్వెల్‌లో చూపించనున్నారు. ఈ సందర్భంగా విడుదల చేసిన పోస్టర్ కూడా ఆసక్తిని రేకెత్తిస్తున్నది. మొదటి భాగంలో కబిలన్‌గా కనిపించిన ఆర్య మరోసారి ఈ ఫ్రాంఛైజీలోకి తిరిగి వస్తున్నారు. మిగతా నటీనటుల వివరాలు వెల్లడికావాల్సి వుంది.















