శ్రీవిష్ణు టైటిల్ రోల్ పోషిస్తున్న చిత్రం కామ్రేడ్ కళ్యాణ్. ఈ చిత్రానికి జానకిరామ్ మారెళ్ల దర్శకుడు. వెంకటకృష్ణ కర్నాటి, సీతా కర్నాటి నిర్మాతలు. కోన వెంకట్ సమర్పకుడు. అక్టోబర్ 9న సినిమా విడుదల కానున్నది. తాజాగా దర్శకుడు అనిల్ రావిపూడి ఈ సినిమా నుంచి ఎత్తర ఎత్తు సాంగ్‌ని విడుదల చేసి చిత్ర బృందానికి శుభాకాంక్షలు అందించారు. ఈ పాటలో శ్రీవిష్ణు పవర్ఫుల్ పెర్ఫార్మెన్స్తో ఆకట్టుకున్నారు.

ఈ సినిమా అక్టోబర్ 9న థియేటర్లలో విడుదల కానుంది. శ్రీవిష్ణు, మహిమా నంబియార్, రాధికా శరత్‌కుమార్, షైన్ టామ్ చాకో, ఉపేంద్ర లిమాయే తదితరులు నటిస్తున్నారు. ఈ సినిమాకి దర్శకత్వం: : జానకిరామ్ మారెళ్ల, సమర్పణ: కోన వెంకట్, నిర్మాతలు: వెంకట కృష్ణ కర్నాటి, సీత కర్నాటి, సంగీతం: విజయ్ బుల్గానిన్, సినిమాటోగ్రఫీ: సాయి శ్రీరామ్, ఎడిటర్: చోటా కె. ప్రసాద్.















