Skip to main content

Namaste NRI

ఎన్నో కష్టాలు ఎదుర్కొని వస్తున్నాం.. తత్వం విజయంతో అవన్నీ మర్చిపోతాం

అర్జున్‌ కోలా దర్శకత్వంలో దినేష్‌ తేజ్‌, దష్విక.కె హీరో, హీరోయిన్లుగా నటించిన చిత్రం తత్వం. త్రయతి ఇషాని క్రియేషన్స్‌, ఎస్‌.కె.ప్రొడక్షన్స్‌ సంయుక్త నిర్మాణంలో శీమకుర్తి వంశీ కృష్ణ, శ్వేత పసుపులేటీ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ సందర్భంగా ఈ చిత్ర ప్రీరిలీజ్‌ వేడుక ఘనంగా జరిగింది. దర్శకుడు అర్జున్‌ కోలా మాట్లాడుతూ ఈ సినిమా సమయంలో చాలా స్ట్రగుల్స్‌ ఫేస్‌ చేశాం. ఈ సినిమా ప్రమోషన్‌ స్టార్ట్‌ చేసిన సమయంలో హీరో, హీరోయిన్‌ కారు యాక్సిడెంట్‌కు గురయ్యారు. వాళ్లు కోలుకునే సరికి టైమ్‌ పట్టింది. అందుకే సినిమా రిలీజ్‌ మళ్లీ డిలే అయ్యింది. ఇప్పుడు మళ్లీ ప్రమోషన్స్‌ స్టార్ట్‌ చేసి అక్టోబర్‌ 2న విడుదల తేదీ ప్రకటించాం. అయితే సడన్‌గా మేం విడుదల చేస్తున్న రోజే డజను సినిమాలు విడుదలవుతున్నాయి. అయినా సరే, కంటెంట్‌ మీద నమ్మకంతో అక్టోబర్‌ 2న విడుదల చేస్తున్నాం. ఈ సినిమా ట్రైలర్‌, పాటలు చూసి అందరూ పాజిటివ్‌ ఆరా ఇచ్చారు. ఓ థ్రిల్లర్‌ మూవీకి కావాలసిన అంశాలు ఇందులో ఉన్నాయి. ప్రేక్షకులు ఇచ్చిన స్పందనతోనే ఈ సినిమాను విడుదల చేయాలని నిర్ణయించు కున్నాం. సినిమా తప్పకుండా విజయం సాధిస్తుందనే నమ్మకం ఉంది. ఈ చిత్ర సక్సెస్‌ సెలబ్రేషన్స్‌తో మా కష్టాలన్నీ మరిచిపోతాం అని అన్నారు.

మేము వెండితెరపై ఈ సినిమా చూసి, ఆడియన్స్‌ ఆదరణ చూసి మా కష్టాలు మరిచి పోతాం అని నిర్మాత శీమకుర్తి వంశీ కృష్ణ చెప్పారు. దినేష్‌ తేజ మాట్లాడుతూ కథ విన్నప్పుడు నాలో ఎలాంటి నమ్మకం ఉందో ఈ రోజుకు అంతకు మించి ఈ చిత్ర విజయంపై విశ్వాసం ఉంది అని అన్నారు. హీరోయిన్ దష్విక మాట్లాడుతూ ఈ సినిమా కచ్చితంగా అందరికీ నచ్చుతుంది. మా అందరి కష్టానికి ప్రేక్షకుల నుంచి పూర్తి స్థాయి సపోర్ట్ లభిస్తుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అని ముగించారు. అక్టోబర్‌ 2న ఈ చిత్రం థ్రియేటికల్‌ విడుదలకు సిద్దమైంది.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events