Skip to main content

Namaste NRI

నాకిష్టమైన నటుల్లో మొదటి వ్యక్తి ఆయనే : ఎన్టీఆర్

ఫహాద్‌ ఫాజిల్‌ కథానాయకుడిగా నటించిన తాజా చిత్రం డోంట్‌ ట్రబుల్‌ ది ట్రబుల్‌. శశాంక్‌ ఏలేటి దర్శకత్వం. ఈ చిత్రాన్ని శోభు యార్లగడ్డ, ప్రసాద్‌ దేవినేని, ఎస్‌.ఎస్‌.కార్తికేయ నిర్మించారు. హైదరాబాద్‌లో అగ్ర కథానాయకుడు ఎన్టీఆర్‌, దర్శకుడు రాజమౌళి ముఖ్య అతిథులుగా ప్రీరిలీజ్‌ ఈవెంట్‌ను నిర్వహించారు. ఎన్టీఆర్‌ మాట్లాడుతూ చేతికి సర్జరీ అయిన దగ్గరి నుంచి జోష్‌ రావడం లేదు. కానీ మీ అందరిని చూసిన తర్వాత ఉత్సాహం వచ్చింది. ఇప్పుడు చేయి బాగా కోలుకుంది. త్వరలో డ్రాగన్‌ షూటింగ్‌ మొదలుపెట్టబోతున్నాం. ఎలాంటి ఆలస్యం లేకుండా ముందస్తుగా ప్రకటించిన తేదీకే సినిమా రిలీజ్‌ అవుతుంది. ఇక ఈ సినిమా విషయానికొస్తే.. నేను చూసిన ఫహాద్‌ ఫాజిల్‌ తొలి చిత్రం బెంగళూరు డేస్‌. అప్పటి నుంచి ఆయన సినిమాల్ని ఇష్టపడటం మొదలుపెట్టాను. ఆయన నటన చూసి స్ఫూర్తిపొందాను. ఫహాద్‌ దేశం గర్వించదగ్గ గొప్ప నటుడు. ఆయన తొలిసారి లీడ్‌ యాక్టర్‌గా తెలుగులో చేస్తున్న ఈ సినిమా అద్భుత విజయం సాధించాలని, కెరీర్‌లో మరపురాని చిత్రంగా మిగిలిపోవాలని కోరుకుంటున్నా. అలాగే నా తమ్ముడు కార్తికేయ నిర్మాతగా రూపొందించిన తొలి చిత్రానికి మీ అందరి ఆశీస్సులు కావాలి అన్నారు.

రాజమౌళి మాట్లాడుతూ ఫహాద్‌ ఫాజిల్‌ సినిమాలు చూసి ఎంతో ఇంప్రెస్‌ అయ్యాను. ట్రాన్స్‌ సినిమా నన్ను నిజంగా ట్రాన్స్‌లోకి తీసుకెళ్లింది. తెలుగు ప్రజలకు ఆయన బాగా చేరువయ్యాడు. దర్శకుడు శశాంక్‌ ఏలేటి నాలుగేళ్ల క్రితం వచ్చి ఓ దెయ్యాన్ని కిడ్నాప్‌ చేసిన మనిషి కథ ఇది అని చెప్పాడు. నాకు బాగా నచ్చింది. రెండు నెలల క్రితం ఫస్ట్‌కాపీ చూశా. చాలా సేపు నవ్వుకున్నా. హార్ట్‌టచింగ్‌గా కూడా అనిపించింది. ఇది చిన్న పిల్లల సినిమా అనుకుంటారు కానీ, ప్రతీ పెద్దోడిలో ఉన్న చిన్న పిల్లల సినిమా అన్నారు.

ఫహాద్‌ ఫాజిల్‌ మాట్లాడుతూ హైదరాబాద్‌ తనకెంతో ప్రత్యేకమని, ఇక్కడ ఎంతో మంది స్నేహితుల్ని సంపాదించుకున్నానని, ఈ నగరంతో ప్రేమలో పడ్డానని చెప్పారు. ఈ సినిమాలోని ప్రతీ సన్నివేశం కొత్తగా ఉంటుందని నిర్మాత కార్తికేయ అన్నారు. వినోదంతో పాటు ఎమోషన్స్‌ ఉన్న సినిమా ఇదని నిర్మాతలు శోభు యార్లగడ్డ, ప్రసాద్‌ దేవినేని పేర్కొన్నారు. ఈ చిత్రం అక్టోబర్‌ 2న ప్రేక్షకుల ముందుకురానుంది.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events