Skip to main content

Namaste NRI

గోల్డ్ స్పాట్ మూవీ ఫస్ట్ సింగిల్ పరిచయమే రిలీజ్

అభిషేక్‌, కాజల్‌ చౌదరి జంటగా నటిస్తున్న చిత్రం గోల్డ్‌ స్పాట్‌. వేణు కార్తికేయన్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి దుష్యంత్‌ కటికనేని కథ, స్క్రీన్‌ప్లే, మాటలు అందిస్తున్నారు. ఈ చిత్రం త్వరలో ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ నేపథ్యంలో మ్యూజికల్‌ ప్రమోషన్స్‌ మొదలుపెడుతూ పరిచయమే అనే పాటను విడుదల చేశారు. ఓ మనసా అలుపే రాదు తలపున నీవుంటే, ఓ మనసా అదుపే లేదు ఎదురుగా నీవుంటే అంటూ చక్కటి ప్రేమ భావాలతో ఈ పాట సాగింది. సున్నితమైన భావోద్వేగాలతో రూపొందిస్తున్న ప్రేమకథా చిత్రమిదని, కాన్సెప్ట్‌ సరికొత్తగా ఉంటుందని మేకర్స్‌ తెలిపారు. ఈ చిత్రానికి సంగీతం: నరేన్‌ రెడ్డి, దర్శకత్వం: వేణు కార్తికేయన్‌.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events