Skip to main content

Namaste NRI

ది డర్టీ పిక్చర్‌2కు రంగం సిద్ధం!

బాలీవుడ్‌లో సంచలనం సృష్టించిన చిత్రాల్లో ది డర్టీ పిక్చర్‌ ఒకటి. సిల్క్‌స్మిత జీవితం ఆధారంగా రూపొందించిన ఈ సినిమా 2011లో విడుదలై బాక్సాఫీస్‌ వద్ద భారీ విజయాన్ని సాధించింది.. విద్యాబాలన్‌ నటనకు సర్వత్రా ప్రశంసలు దక్కాయి. ఉత్తమ నటిగా జాతీయ పురస్కారాన్ని సొంతం చేసుకుంది. దాదాపు 15 ఏండ్ల విరామం తర్వాత ఈ చిత్రానికి సీక్వెల్‌గా ది డర్టీ పిక్చర్‌2ను రూపొందించబోతున్నట్లు నిర్మాత ఏక్తా కపూర్‌ ప్రకటించారు. ఓ పాడ్‌కాస్ట్‌లో పాల్గొన్న ఆమె ఈ విషయాన్ని వెల్లడించారు.


ఈ సినిమాకు సీక్వెల్‌లో చెప్పాల్సిన కథ తనకు ఇప్పుడు దొరికిందని ఆమె అన్నారు. అయితే ఈ సీక్వెల్‌లో కథ ఎవరి జీవితం ఆధారంగా ఉంటుంది? దర్శకుడు, నటీనటులెవరనే విషయాలపై ఏక్తాకపూర్‌ ఎలాంటి స్పష్టతనివ్వలేదు. తొలిభాగం మాదిరిగానే రెండో భాగం కూడా ఓ ప్రముఖ వ్యక్తి జీవితానికి సంబంధించిన కథతో రూపొందే అవకాశం ఉందని బాలీవుడ్‌ టాక్‌.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events