Skip to main content

Namaste NRI

అరుదైన గౌరవం.. ఆర్థిక శాస్త్రంలో ఇద్దరికి నోబెల్‌ పుర‌స్కారం

ఆర్థిక‌శాస్త్రంలో 2026 సంవ‌త్స‌రానికి ఇద్ద‌రు శాస్త్ర‌వేత్త‌లకు నోబెల్ బ‌హుమ‌తిని ప్ర‌క‌టించారు. రాబ‌ర్ట్ ఈ హాల్‌, మైఖేల్ వుడ్‌పోర్డ్‌ ఈ యేటి ఎక‌నామిక్స్ అవార్డును గెలుచుకున్నారు. స్థూల ఆర్థిక స్థిరీక‌ర‌ణ కోసం అవ‌స‌ర‌మైన సూక్ష్మ ఆర్థిక వ్య‌వస్థ‌ల‌ను రూపొందించిన‌ట్లు త‌న ప్ర‌క‌ట‌న‌లో పేర్కొన్న‌ది. స్వెరిజెస్ రిక్స్‌బ్యాంక్ ప్రైజ్ పేరుతో ఆర్థిక‌శాస్త్రంలో అవార్డు అంద‌జేస్తారు. ఈ శాస్త్ర‌వేత్త‌లు డెవ‌ల‌ప్‌ చేసిన స్థూల ఆర్థిక మోడ‌ల్స్‌తో, స్థిరీక‌ర‌ణ విధానాన్ని స‌మ‌ర్థ‌వంతంగా అమ‌లు చేసిన‌ట్లు నోబెల్ క‌మిటీ పేర్కొన్న‌ది.

ఆర్థిక స్థిరీక‌ర‌ణ కోసం వీళ్లు రూపొందించిన మోడ‌ళ్ల‌తోనే ప్ర‌పంచ‌వ్యాప్తంగా సెంట్ర‌ల్ బ్యాంకులు, ప్ర‌భుత్వాలు త‌మ ఆర్ధిక విధానాల‌ను అమ‌లు చేస్తున్న‌ట్లు నోబెల్ క‌మిటీ చెప్పింది. ఆర్థిక ఒడిదిడుకుల‌ను ఎదుర్కొనే రీతిలో ఆ మోడ‌ళ్లు ఉన్న‌ట్లు క‌మిటీ పేర్కొన్న‌ది. ఇంధ‌నం సంక్షోభం, గృహ వినియోగాల్లో జ‌రిగే ఆక‌స్మిక మార్పుల‌ను ఎదుర్కొనే రీతిలో స్థూల‌, సూక్ష్మ విధానాల‌ను రూపొందించారు.స్టాక్‌హోమ్‌లోని రాయ‌ల్ స్విడిష్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ ఈ అవార్డును ప్ర‌క‌టించింది.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events