గ్లోబల్ స్టార్ యాక్టర్ ప్రభాస్ కాంపౌండ్ నుంచి వస్తోన్న ప్రాజెక్టుల్లో ఒకటి ఫౌజీ. హను రాఘవపూడి దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ ఇమాన్వీ హీరోయిన్గా నటిస్తోంది. తన కోస్టార్లకు షడ్రుచులతో కూడిన భోజనం పెట్టి మరిచిపోలేని ఆతిథ్యాన్నిచ్చే యాక్టర్లలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తర్వాతే మరెవరైనా అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఎప్పటికప్పుడు కొత్త కొత్త వంటకాలతో సెట్స్‌లో ఉన్నవారిని సర్ప్రైజ్ చేయడంలో ముందుంటాడు. ప్రభాస్ కోస్టార్ ఇమాన్వీ మంగళవారం 31వ పుట్టినరోజు జరుపుకుంది. ఈ సందర్భంగా ఇమాన్వీకి పలు సర్ప్రైజలు వచ్చాయి. అందులో ప్రత్యేకమైంది ప్రభాస్ పంపిన గిఫ్ట్ ఇంతకీ అదేంటో ఊహించే ఉంటారు. ఇమాన్వీకి ప్రభాస్ రకరకాల వెరైటీ వంటకాలతో కూడిన భోజనాన్ని పంపించాడు. ప్రభాస్ పంపిని ప్రత్యేకమైన భోజనాన్ని ఫొటో తీసి ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది ఇమాన్వీ. నా హృదయం, కడుపు ఎప్పటికీ నిండుగా ఉంటాయంటూ క్యాప్షన్ ఇచ్చింది ఇమాన్వీ.

హైదరాబాదీ ఫీస్ట్, బిర్యానీ, పులావ్, డిఫరెంట్ స్టార్టర్స్‌తో ఇమాన్వీ టేబుల్‌ను నింపేశాడు ప్రభాస్. చికెన్ 65, చిల్లీ చికెన్, సీఖ్, షమీ కెబాబ్స్, తంతూరి చికెన్, కర్రీస్, గ్రేవీస్, సాలన్, రైతా, చట్నీలు.. ఇలా ఎన్నో రకాల వెరైటీలు టేబుల్‌పై ఉన్నాయి. చూడగానే కడుపు నిండిపోయినట్టు అనిపించే స్పెషల్ మీల్ ఇమాన్వీ కెరీర్లో మరిచిపోలేని బర్త్ డే గిఫ్ట్ అని చెప్పక తప్పదు.















