స్వీయ దర్శకత్వంలో డా॥ సాయివెంకట్ నటిస్తున్న ఆధ్యాత్మిక చిత్రం జయహో రామానుజ. సుదర్శనం ప్రొడక్షన్స్ పతాకంపై సాయిప్రసన్న, ప్రవళ్లిక నిర్మిస్తున్నారు. జోశర్మ, సుమన్, ప్రవళ్లిక కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ నెల 24న ప్రేక్షకుల ముందుకురానుంది. గురువారం ట్రైలర్ను విడుదల చేశారు.

ఆధ్యాత్మిక విప్లవకారుడు, సమసమాజమే ధ్యేయంగా పనిచేసిన రామానుజాచార్యుల జీవితం గురించి నేటితరానికి తెలియజెప్పాలనే సంకల్పంతో ఈ చిత్రాన్ని రూపొందించామని సాయివెంకట్ తెలిపారు. ఈ సినిమాలో తనకు మంచి పాత్ర దక్కిందని, ఈ సినిమా ద్వారా ప్రతీ ఒక్కరూ రామానుజాచార్యుల గొప్పదనాన్ని తెలుసుకుంటారని సుమన్ పేర్కొన్నారు. సుమన్, ప్రవళ్లిక అశ్వాపురం తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి నిర్మాణ సంస్థ: సుదర్శనం ప్రొడక్షన్స్, కథ, స్క్రీన్ప్లే, దర్శకత్వం: లయన్ సాయి వెంకట్.















