Skip to main content

Namaste NRI

అలియాస్ రుక్మిణి ఫస్ట్ సింగిల్ డేట్ ఫిక్స్.. రుకు రుకు రుక్మిణి ఎప్పుడంటే?

నేచురల్ స్టార్ నాని సమర్పణలో టాలెంటెడ్ హీరో నితిన్ నటిస్తున్న తాజా చిత్రం అలియాస్ రుక్మిణి. మురళీకాంత్ దేవసోత్ రచన, దర్శకత్వం. ఈ ఫీల్ గుడ్ ఫ్యామిలీ అండ్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్ నుంచి తాజాగా మేకర్స్ మ్యూజికల్ ప్రమోషన్స్ అప్‌డేట్‌ను అనౌన్స్ చేశారు. ఈ చిత్రంలో కృష్ణ పాత్రలో నటిస్తున్న నితిన్, రుక్కుతో ప్రేమలో పడే నేపథ్యంలో సాగే సుందరమైన రొమాంటిక్ గీతం రుక్కు రుక్కు రుక్మిణి ఫస్ట్ సింగిల్‌ను అక్టోబర్ 27న విడుదల చేయనున్నట్లు చిత్ర యూనిట్ అధికారికంగా వెల్లడించింది.

ఈ చిత్రంలో నితిన్ సరసన ఆఫియా సయ్యద్ నాయికగా నటిస్తుండగా, సాయి కుమార్, హర్షవర్ధన్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. యానిమస్ ప్రొడక్షన్స్ పతాకంపై దీప్తి గంటా ఈ సినిమాను నిర్మిస్తుండగా, విజయ్ బుల్గానిన్ సంగీతం అందిస్తున్నారు మరియు జోమన్ టి. జాన్ సినిమాటోగ్రఫీ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. భారీ అంచనాల మధ్య రూపొందుతున్న ఈ సినిమా డిసెంబర్ 4న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events