Namaste NRI

వేసవి లో రామారావు ఆన్ డ్యూటీ

మాస్‌ మహారాజా రవితేజ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం రామారావు ఆన్‌ డ్యూటీ. దివ్యాంక కౌశిక్‌, విజయన్‌ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాలో వేణు తొట్టెంపూడి ప్రధాన పాత్ర చేస్తున్నారు. శరత్‌ మండవ దర్శకత్వంలో సుధాకర్‌ చెరుకూరి నిర్మిస్తున్నారు. కాగా ఈ సినిమాని 2022 మార్చి 25న రిలీజ్‌ చేయనున్నట్లు ప్రకటించారు. యాక్షన్‌ థ్రిల్లర్‌గా రాబోతోతున్న చిత్రమిది. వాస్తవ సంఘటనల ఆధారంగా తెరకెక్కుతోంది.  ప్రస్తుతం హైదరాబాద్‌లో యాక్షన్‌ సీక్వెన్స్‌లు తీస్తున్నాం. మార్చి చివరి వారంలో వేసవి  సీజన్‌ మొదలవుతుంది. సమ్మర్‌ రేసులో రవితేజ బరిలోకి దిగుతారు అని చిత్ర యూనిట్‌ పేర్కొంది. ఇప్పటి వరకూ విడుదల చేసిన పోస్టర్లకు మంచి స్పందన వచ్చిందన్నారు. సామ్‌ సీఎస్‌ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: సత్యన్‌ సూర్యన్‌, కూర్పు: ప్రవీణ్‌ కేఎల్‌, కళ: సాహి సురేష్‌.

Social Share Spread Message

Latest News