Skip to main content

Namaste NRI

డల్లాస్ టెక్సాస్ లో వైభవంగా ‘నెల నెలా తెలుగు వెన్నెల’ 19వ వార్షికోత్సవం.. ఆకట్టుకున్న నేమాని వారి ఏకాదశావధానము

డల్లాస్, టెక్సాస్ :ఉత్తర టెక్సాస్ తెలుగు సంఘం (టాంటెక్స్) నలభై వసంతాల మధుర స్మృతుల పున:స్సమాగమ వేళ… మన ఆత్మీయ తెలుగు బంధువుల చిరునవ్వుల కాంతి చుక్కలను తాకుతూ, నిర్వాహకుల అంకితభావం వికసించగా, సాహితీ, సంప్రదాయ, సంస్కృతులకు పట్టాభిషేకం జరిగింది. అక్టోబర్ 24 నాడు డల్లాస్ టెక్సాస్ లోని ”ఫ్రిస్కో ఫ్లయర్స్ ఈవెంట్ సెంటర్’ లో ‘నెల నెలా తెలుగు వెన్నెల’ తెలుగు సాహిత్య వేదిక 19వ వార్షికోత్సవం అత్యంత వైభవంగా నిర్వహించబడింది.

ఈ వేడుకల్లో భాగంగా ఏర్పాటు చేసిన ‘సంగీత సాహిత్య నృత్య సమ్మేళనం’ హిందీ, తెలుగు భాషల మేలు కలయికతో ప్రేక్షకులను ఎంతగానో అలరించింది.
కార్యక్రమంలో ప్రధాన ఆకర్షణగా నిలిచిన ‘ఏకాదశావధానము’ సాహితీ ప్రియులను మంత్రముగ్ధులను చేసింది. ప్రొఫెసర్ పుదూరు జగదీశ్వరన్ సమర్థవంతమైన అధ్యక్షులుగా పాల్గొని అవధాన నిర్వహణను ప్రక్రియను తెలియజేయగా ప్రసిద్ధ అవధాని ‘అవధాని వేదండ్ర’ ‘ప్రవాసాంధ్ర ప్రభాకర’ నేమాని లక్ష్మీ నరసింహ సోమయాజులు ఈ ఏకాదశ అవధానాన్ని అత్యంత ప్రతిభావంతంగా నిర్వహించారు.
ఈ అవధానంలో పృచ్ఛకులుగా ప్రముఖ సాహితీవేత్తలు, ప్రముఖులు పాలుపంచుకున్నారు:

*ప్రొఫెసర్ పుదూరు జగదీశ్వరన్: అధ్యక్షులు -అవధాన నిర్వహణ-ప్రక్రియ
*నేమాని లక్ష్మీ నరసింహ సోమయాజులు: అవధానం:

  • డాక్టర్.జంధ్యాల జయ కృష్ణ బాపూజీ…నిషిద్ధాక్షరి.
  • సురేష్ కాజా……..సమస్య .
  • డాక్టర్ నరసింహ రెడ్డి ఊరిమిండి….దత్తపది .
  • డాక్టర్ ఆంజనేయులు తాళ్లూరి ……న్యస్తాక్షరి
  • సుబ్రహ్మణ్యం జొన్నలగడ్డ….వర్ణన
  • దయాకర్ మాడ….అప్రస్తుత ప్రసంగము .
  • చిన్నసత్యం వీర్నపు…..వాసరా గణనం .
  • డాక్టర్ మామిళ్ళ లోకనాధం..ఛందోభాషణము
    *లెనిన్ వేముల….పురాణపఠనము .
    *డాక్టర్ తోటకూర ప్రసాద్…హిందీ వర్ణన
  • మహేష్ ఆదిభట్ల…..హిందీ వర్ణన

పృచ్ఛకులు విసిరిన వివిధ కఠినమైన సమస్యలను, సవాళ్లను అవధాని నేమాని వారు తమ అద్భుతమైన ధారణాశక్తితో, హిందీ మరియు తెలుగు మరియు హిందీ భాషలు అవలీలగా సమ్మిళితము చేసి చమత్కార భరితమైన పద్య పూరణలతో సమర్థవంతంగా పరిష్కరించి సభను రంజింపజేశారు. పృచ్ఛకులు డాక్టర్.జంధ్యాల జయ కృష్ణ బాపూజీ,డాక్టర్ నరసింహ రెడ్డి, ఊరిమిండి, డాక్టర్ ఆంజనేయులు తాళ్లూరి,డాక్టర్ మామిళ్ళ లోకనాధం అవధాని గారిని పద్యాలతో ప్రశంసించారు .తెలుగు ,సంస్కృత మరియు హిందీ భాషాభిమానులు, సాహిత్యాభిలాషులైన ప్రముఖులు పెద్ద సంఖ్యలో హాజరైన ఈ కార్యక్రమం, ప్రవాసంలో తెలుగు భాషా సంస్కృతుల పరిరక్షణకు, సాహిత్య వికాసానికి టాంటెక్స్ చేస్తున్న కృషికి మరొక మచ్చుతునకగా నిలిచింది.అవధాని నేమాని లక్ష్మీ నరసింహ సోమయాజులు గారిని ప్రశంసిస్తూ టాంటెక్స్ సంస్థ సమర్పించిన సన్మాన ప్రశంసా పత్రాన్ని అందించి ఘనంగా సన్మానించడం తో పాటు పదకొండుమంది పృచ్ఛకులను కూడా సన్మానించడం జరిగింది. ఇంత మంది సాహితీప్రియులు హాజరైన సాహితీసదస్సుకు ఆహ్వానించి పదకొండుమంది పృచ్ఛకులతో ఏకా దశావధానము నిర్వహించే అవకాశము కలుగజేసినందుకు అవధాని నేమాని లక్ష్మీ నరసింహ సోమయాజులు కృతజ్ఞతలు తెలియజేస్తూ,తెలుగు భాషా రక్షణకు, సాహిత్య వికాసానికి టాంటెక్స్ చేస్తున్న కృషిని కొనియాడారు. నిర్వాహకులు, వాలంటీర్ల అంకితభావంతో కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు నవీన్ గొడవర్తి ,పవన్ నర్రా ,కమలాకర్ దేవరకొండలకు ప్రశంస పత్రాలు అందచేసిన సంస్థ ప్రస్తుత అధ్యక్షులు మాధవి లోకిరెడ్డి ,ఉత్తరాధ్యక్షులు ఉదయ్ నిడిగంటి ఉపాధ్యక్షులు సునీల్ సూరపురాజు ,సమన్వయ కర్త దయాకర్ మాడ సంస్థను ఆర్ధికంగా ప్రోత్సహిస్తున్న పోషకులకు , టాంటెక్స్ పాలక మండలి సభ్యులకు , సాహితీ ప్రియులకు ధన్యవాదాలు తెలపడంతోఈ కార్యక్రమం విజయవంతంగా ముగిసింది.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events