Namaste NRI

ఆర్ ఆర్ ఆర్ నుంచి కొత్త పోస్టర్

ఎన్టీఆర్‌, రామ్‌ చరణ్‌ హీరోలుగా రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన చిత్రం ఆర్‌ఆర్‌ఆర్‌. ఇందులో స్వాతంత్య్ర సమరయోధులు కొమురం భీమ్‌ పాత్రలో ఎన్టీఆర్‌, అల్లూరి సీతారామరాజు పాత్రలో రామ్‌చరణ్‌ కనిపిస్తారు. ఆర్‌ఆర్‌ఆర్‌ ట్రైలర్‌ ఈ నెల 9న విడుదల కానున్న సందర్భంగా ఈ సినిమాలో ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌ కొత్త పోస్టర్స్‌ను విడుదల చేశారు. అందులో ఎన్టీఆర్‌, రామ్‌ చరణ్‌లిద్దరూ కండలు తిరిగిన దేహాలతో కనిపిస్తూ సినిమాపై మరిన్ని అంచనాల్ని రేకెత్తిస్తున్నారు. సినిమాలో ఇంకెన్నో ఆకర్షణలు అంటూ ఊరిస్తున్నారు. శత్రువులపై విరుచుపడటానికి ముందు సింహనాదం చేస్తూ ఈ పోస్టర్‌లో అల్లూరిగా చరణ్‌ కనిపిస్తున్నాడు. ఫిరంగి గుండ్లను కూడా తన పిడికిలిలో నుసి చేయాలనేంత ఆగ్రహంతో ఆయన కనిపిస్తున్నాడు. ఈ చిత్రాన్ని డీవీవీ దానయ్య నిర్మిస్తున్నారు.  జనవరి 7వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయనున్నారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events