అమెరికా అంతరిక్ష సంస్థ (నాసా) చేపట్టబోతున్న వ్యోమగామి (ఆస్ట్రోనాట్) శిక్షణా కార్యక్రమానికి భారతీయ సంతతి వ్యక్తి ఎంపికయ్యారు. యూక్రెయిన్ భారతీయ మూలాలున్న డా.అనీల్ మీనన్ ఈ అరుదైన అవకాశాన్ని చేజిక్కించుకున్నారు. ఈ కార్యక్రమానికి మొత్తం 12 వేల మంది దరఖాస్తు చేసుకోగా నాసా చివరికి 10 మందిని ఎంపిక చేసింది. వీరిలో అనీల్ మీనన్ కూడా ఒకరు. రెండేళ్ల పాటు సాగే ఈ శిక్షణ కార్యక్రమం అనంతరం ఈ 10 మంది అంతరిక్ష మిషన్లలో వ్యోమగాములుగా పాల్గొంటారు. డా.మీనన్(45) మిన్నెసొటా రాష్ట్రంలో జన్మించారు. గతంలో ఆయన స్పేస్ ఎక్స్ సంస్థలో ఫ్లైట్ సర్జన్‌గా సేవలందించారు. స్పెక్స్ సంస్థ చేపట్టిన డెమో `2 మిషన్‌లో పాలుపంచుకున్నారు. 2014లో ఆయన నాసాలో చేరారు. ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్‌కు చెందిన నాలుగు దీర్ఘకాలిక మిషన్లలో డిప్యూటీ క్రూ సర్జన్‌గా పాలుపంచుకున్నారు. సోయూజ్ మిషన్లలో ప్రధాన క్రూ సర్జన్‌గా కూడా సేవలందించారు.














