ఇంద్రసేన, సంతోష్ రాజ్, నవీనా రెడ్డి, మెరిన్ ఫిలిప్, ప్రగ్యా నయన్ ముఖ్య తారాగణంగా రూపొందుతున్న చిత్రం బద్మాష్ గాళ్లకి బంపర్ ఆఫర్. ఈ సినిమా ఫస్ట్ లిరికల్ సాంగ్ ఎవడు చెప్పిండ్రాని నిర్మాత దిల్ రాజు విడుదల చేశారు. ఈ సందర్భంగా దర్శకుడు రవి చావలి మాట్లాడుతూ సస్పెన్స్ కామెడీ డ్రామా మూవీగా తెరకెక్కిన మా చిత్రం ప్రతి పది నిమిషాలకు ఒక ట్విస్ట్ ఇస్తూ సాగుతుంది. ఈ థ్రిల్లర్ కథలో ఇమిడి పోయేలా పాటలు ఉంటాయి అన్నారు. చిత్ర సమర్పకులు రాఘవేంద్రరెడ్డి మాట్లాడుతూ మంచి టెక్నికల్ టీమ్ బద్మాష్ గాళ్లకి బంపర్ ఆఫర్ సినిమాకు పనిచేశారు అన్నారు. సస్పెన్స్ కామెడీ డ్రామా కథతో ఈ చిత్రాన్ని దర్శకుడు రవి చావలి తెరకెక్కిస్తున్నారు. అతీంద్ర అవినాష్, అలవలపాటి శేఖర్ నిర్మిస్తున్నారు. రాఘవేంద్ర రెడ్డి సమర్పకులుగా వ్యవహరిస్తున్నారు. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా పూర్తయ్యాయి. సత్యప్రకాశ్, శుభలేఖ సుధాకర్ తదితరులు నటించిన ఈ చిత్రానికి ఛాయాగ్రహణం : విజయ్ సి.కుమార్, సంగీతం : బాంబే భోలే.
![](https://namastenri.net/wp-content/uploads/2025/02/donaldTrump-3-300x160.jpg)