Skip to main content

Namaste NRI

మా అధ్యక్షుడు మంచు విష్ణు సంచలన నిర్ణయం

మూవీ ఆర్టీస్ట్‌ అసోసియేషన్‌ (మా) అధ్యక్షుడు మంచు విష్ణు సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇటీవల జరిగిన మా ఎన్నికల్లో ప్రకాశ్‌ రాజ్‌ ప్యానల్‌ తరపున గెలుపొందిన 11 మంది రాజీనామాలను ఆమోదించారు. మా అసోసియేషన్‌ అధ్యక్ష ఎన్నికల తర్వాత ప్రకాష్‌ రాజ్‌ ప్యానెల్‌ లో గెలిచిన 11 మంది అసోసియేషన్‌ సభ్యులు తమ పదవులకు రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. విష్ణు ఇబ్బందులు ఉండకూడదనే తమ మెంబర్స్‌ రాజీనామా చేసినట్లు ప్రకాష్‌ రాజ్‌ తెలిపారు. అయితే   రాజీనామాలు చేయొద్దని కోరినా, వెనక్కి తీసుకోమన్నా వాళ్లు అంగీకరించలేదని, అందుకే ఆమోదించామని మంచువిష్ణు క్లారిటీ ఇచ్చారు.

ప్రకాష్‌ రాజ్‌ ప్యానెల్‌ నుంచి గెలుపొందిన శ్రీకాంత్‌, ఉత్తేజ్‌ సహా మొత్తం 11 మంది రాజీనామాలను ఆమోదించినట్లు తెలిపారు. అయితే మా సభ్యత్వానికి నాగబాబు, ప్రకాశ్‌ రాజ్‌ చేసిన రాజీనామాలు ఆమోదించలేదని తెలిపారు. మా బిల్లింగ్‌పై చర్చలు జరుగుతున్నాయని, వారం, పదిరోజుల్లో నిర్ణయం తీసుకుని ప్రకటన చేస్తామన్నారు.

Social Share Spread Message

Latest News