Skip to main content

Namaste NRI

క్రిస్టియానో రొనాల్డ్‌కు అరుదైన గౌరవం

అంతర్జాతీయ పుట్‌బాల్‌  క్రీడాకారుడు పోర్చుగీస్‌ ఆటగాడు క్రిస్టియానో రొనాల్డ్‌కు భారత్‌లో అరుదైన గౌరవం లభించింది. గోవా రాజధాని పనాజీలో ఆయన కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించారు. పనాజీలో 410 కిలోల బరువున్న రొనాల్డో కాంశ్య విగ్రహాన్ని గోవా మంత్రి మైకేల్‌లోబో ఆవిష్కరించారు. ఇండియాలో రొనాల్డ్‌ విగ్రహం ఏర్పాటు చేయం ఇదే మొదటిసారి అని ఇక్కడి యువత రొనాల్డోను ఆదర్శంగా తీసుకుని ఫుట్‌బాల్‌లో మరింత ముందుకు పోవాలనేది తన కోరిక అని మంత్రి పేర్కొన్నారు. ఫుల్‌బాల్‌ను ప్రోత్సహించేందుకు తమ ప్రభుత్వం ఎప్పుడూ సిద్ధమేనని పుటబాల్‌ మైదానాల్లో ప్రాక్టీస్‌కు వచ్చే యువతకు అన్ని సౌకర్యాలు కల్పించే బాధ్యత మాదేనన్నారు. ఇక రొనాల్డో ప్రస్తుతం పోర్చుగల్‌ జట్టుతో పాటు మాంచెస్టర్‌ యునైటెడ్‌కు సైతం ప్రాతినిధ్యం వహించారు.  వయసులో చిన్నవాడైన ఫుట్‌బాల్‌లో మాత్రం కోట్లల్లో అభిమానులను సంపాదించిన రొనాల్డోకు భారత్‌లో అపురూపగౌరవం దక్కింది.

Social Share Spread Message

Latest News