ఉగ్రవాద సంస్థ ఇస్లామిక్ స్టేట్ (ఐఎస్) కు భారీ ఎదురు దెబ్బ తలిగింది. అమెరికా ప్రత్యేక దళాలు వాయువ్య సిరియాలో జరిపిన మెరుపు దాడుల్లో ఉగ్రవాద సంస్థ ఐసిస్ చీఫ్ అబూ ఇబ్రహీం అల్ హషిమీ అల్ ఖురేషీ సిరియాలో హతమ్యాడు. ఈ విషయాన్ని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ వెల్లడిరచారు. వాయవ్య సిరియాలో అమెరికా భద్రతా బలగాలు విజయవంతంగా ఉగ్రవాద నిర్మూలన చర్యలు చేపట్టాయి. ఐసిస్ ఉగ్రవాది అబూ ఇబ్రహీం హతమయ్యాడు అని పేర్కొన్నారు. సిరియాలోని అట్మే నగరంలో అబూ ఇబ్రహీం నివాసంపై అమెరికా బలగాలు దాడులు జరిపాయి. అయితే దాడుల సందర్భంగా బలగాలకు చిక్కకుండా ఉండేందుకు అబూ ఇబ్రహీం తన నివాసాన్ని బాంబులతో పేల్చేకున్నట్లు మీడియా వెల్లడిరచింది. ఈ ఘటనలో అబూ కుటుంబ సభ్యులు కూడా మరణించారు.
ఈ ఆపరేషన్‌లో అమెరికా సైనికుడు ఎవరూ కానీ సైనిక సిబ్బంది కానీ గాయపడలేదు. ఆపరేషన్ తర్వాత సిబ్బంది సురక్షితంగా తిరిగి వచ్చారని జో బైడెన్ తెలిపారు. అమెరికా సేనలు దాడులు చేస్తున్నపుడు ఆ దాడుల్లో మరణించకుండా ఖురేషీ బాంబుతో పేల్చుకున్నాడన్నారు. ఈ పేలుడులో అతని కుటుంబ సభ్యులు కూడా చనిపోయారని వైట్‌హౌస్ అధికారి తెలిపారు. బాంబు దాడుల్లో ఇల్లు పూర్తిగా నేలమట్టమైందని పేర్కొన్నారు. .














