సౌదీ అరేబియా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నెల 9వ తేదీ నుంచి కొత్త ప్రయాణ ఆంక్షలు అమలులోకి వస్తాయని సౌదీ అరేబియా అంతర్గత మంత్రిత్వశాఖ వెల్లడిరచింది. ఫిబ్రవరి 9 నుంచి సౌదీ పౌరులు విదేశాలకు వెళ్లాలంటే తప్పనిసరిగా బూస్టర్ డోసు తీసుకుని ఉండాలి. కింగ్‌డమ్‌కు వచ్చే సౌదీ పౌరులతో సహా ప్రతి ప్యాసెంజర్ పీసీఆర్ టెస్టు నెగెటివ్ సర్టిఫికేట్ చూపించడం తప్పనిసరి. ప్రయాణానికి 48 గంటల ముందు తీసుకోని ఉండాలి. 8 ఏళ్లలోపు పిల్లలకు దీని నుంచి మినహాయింపు ఇచ్చింది. కరోనా పాజిటివ్‌గా తేలి, టీకా తీసుకున్న సౌదీ పౌరులకు ఏడు రోజుల తర్వాతే దేశంలోకి ఎంట్రీ ఉంటుందని పేర్కొంది. వ్యాక్సినేషన్ పూర్తి కాని వారికి పాజిటివ్‌గా వస్తే మాత్రం 10 రోజుల పాటు దేశం బయట ఉండాలని తెలియజేసింది. విదేశాలకు వెళ్లే సౌదీ పౌరులు రెండో డోసు తీసుకుని మూడు నెలలు గడిచిన తర్వాత బూస్టర్ డోసు తీసుకోవాలని తెలిపింది. ప్రజల ఆరోగ్య పరిరక్షణను దృష్టిలో పెట్టుకుని కొత్త ప్రయాణ ఆంక్షలను తీసుకు వస్తున్నట్లు మంత్రిత్వశాఖ స్పష్టం చేసింది.














